
వనపర్తి, వెలుగు: కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేరస్తులను అరెస్ట్ చేయాలని వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. మంగళవారం ఆత్మకూరు మండలం జూరాల జెన్కో గెస్ట్‌హౌజ్‌లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదయిన గ్రేవ్ కేసులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టేషన్లలో వర్టికల్స్ పనితీరు సక్రమంగా ఉండాలని వాటిని ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు.
. పట్టణాల్లో నేరాల నియంత్రణకు గస్తీ నిర్వహించాలని సూచించారు. బ్లూ కోల్ట్స్, డయల్ 100, కోర్టు డ్యూటీ ఆఫీసర్ విధులను ప్రతిరోజు ప్రతివారం పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు శివకుమార్, రాంబాబు, కృష్ణయ్య, డీసీఆర్బీ ఎస్సై తిరుపతిరెడ్డి, పాల్గొన్నారు.