డ్రగ్స్ రహిత జిల్లాగా వనపర్తి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

డ్రగ్స్ రహిత జిల్లాగా వనపర్తి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
  •     కలెక్టర్ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగు : డ్రగ్స్ రహిత జిల్లాగా వనపర్తిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో జిల్లాస్థాయి నార్కోటిక్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2017--–25 ఇప్పటివరకు జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలు కేసులు 25 నమోదైనట్లు తెలిపారు. మెడికల్ షాపుల్లో ఆల్ర్ఫాజోలం వంటి డ్రగ్స్ ను డాక్టర్ సిఫార్సు చేయకుండా ఇవ్వొద్దన్నారు. 

అనుమతులు లేకుండా ఆల్ర్ఫాజోలం అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని కల్లు దుకాణాలపై నిఘా పెట్టాలని,  కల్లులో మత్తు పదార్థం వినియోగాన్ని కట్టడి చేయాలని చెప్పారు. చిన్నపిల్లలకు కల్లు అమ్మిన దుకాణాల లైసెన్స్ రద్దు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 

గంజాయి సాగుపై వ్యవసాయ విస్తీర్ణాధికారుల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో యాంటి డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్పీ సునీతరెడ్డి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వినియోగం, సరఫరా చేసే వారిపై, గంజాయి పండించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బడీడు పిల్లలు బడుల్లోనే ఉండాలని చెప్పారు. అనంతరం ప్రజావాణిలో వచ్చిన 40 దరఖాస్తులను కలెక్టర్​స్వీకరంచి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.