
2025లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రిలీజైన భారీ సినిమాలు వార్ 2, కూలీ. ఈ సినిమాల మధ్య తగ్గ పోరు నడుస్తుంది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న విడుదలయ్యి మంచి వసూళ్లు రాబడుతున్నాయి. రెండింటికి రెండు డిఫరెంట్ అండ్ క్యూరియాసిటీ కథలతో తెరకెక్కినప్పటికీ.. ఆడియన్స్ నుంచి మిక్సెడ్ టాక్ అందుకున్నాయి. అయినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద రెండు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా నెట్ మార్కును చేరుకున్నాయి. అయితే, 2వ రోజైన ఆగస్టు 15న ఈ రెండు సినిమాల వసూళ్లు ఎలా ఉన్నాయనేది ఓ లుక్కేద్దాం.
వార్ 2 vs కూలీ:
సాక్నిల్క్ ట్రేడ్ ట్రాకర్ ప్రకారం:
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు వార్ 2 మూవీ భారీ వసూళ్లను సాధించింది. రెండవ రోజు (శుక్రవారం) రూ.56.35 కోట్ల నెట్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా హిందీలో రూ.44కోట్లు చేయగా, తెలుగులో రూ.12 కోట్లు సాధించింది.
అయితే, తొలిరోజు (రూ.52 కోట్లు) కంటే రెండోవరోజు ఎక్కువ (రూ.56.35 కోట్లు) నెట్ వసూళ్లు సాధించడం గమనార్హం. ఈ క్రమంలో వార్ 2 మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అన్ని భాషలలో కలిపి రూ. 108.35 కోట్ల వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే, గ్రాస్ వసూళ్లు ఎంతనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది.
Also Read : హీరోయిన్ అయితే ఇంట్లోకి కూడా వచ్చేస్తారా..?
ఆగస్టు 15న హిందీ థియేటర్లలో వార్ 2 మొత్తం 51.52% ఆక్యుపెన్సీని కలిగి ఉంది. మార్నింగ్ షోలు: 27.16%, మధ్యాహ్నం 58.71%, సాయంత్రం 63.86%, నైట్ షోలు: 56.36%గా ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. తెలుగులో 68.99% మొత్తం ఆక్యుపెన్సీని చూసింది.
కూలీ వసూళ్లు:
రజినీకాంత్ నటించిన కూలీ మూవీ తొలిరోజు ఇండియా వైడ్ గా రూ.65 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.151కోట్ల గ్రాస్ కలెక్షన్లు చేసి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. లోకేష్ తెరకెక్కించిన 'లియో' ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.148.5 కోట్లు వసూలు చేసింది. ఇది నిన్నటివరకు తమిళ సినిమాకు బెంచ్‌మార్క్. కూలీ ఇప్పుడు ఈ లెక్కను అధిగమించేసింది.
Superstar Rajinikanth The Record Maker & Record Breaker 🔥🔥🔥#Coolie becomes the Highest ever Day 1 worldwide gross for a Tamil film with 151 Crores+#Coolie in theatres worldwide🌟@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj… pic.twitter.com/k3wLtIMqPn
— Sun Pictures (@sunpictures) August 15, 2025
ఈ క్రమంలో రెండోరోజు ఆగస్ట్ 15 నాడు కూలీ తన మార్క్ రూ.53.50కోట్ల నెట్ సాధించింది. అత్యధికంగా తమిళంలో రూ.33.5 కోట్లు చేయగా.. తెలుగులో రూ.13కోట్లు, హిందీలో రూ.6.5కోట్లు సాధించింది. కూలీ మూవీ రెండు రోజుల్లో రూ.118.5 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
అయితే, కూలీ మూవీ రెండో రోజు ఎన్టీఆర్ నటించిన వార్ 2 కంటే తక్కువ కలెక్షన్స్ చేసింది. (వార్ 2 రెండోవరోజు రూ.56.35 కోట్ల నెట్). వార్ 2 మూవీ కూలీ కంటే దాదాపు రూ.3 కోట్లు ఎక్కువ వసూళ్లు చేసింది. ఇకపోతే.. కూలీ రెండ్రోజుల గ్రాస్ వసూళ్లు ఎంతనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ట్రేడ్ ట్రాకర్ల ప్రకారం, కూలీ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించాలి.