ట్రాఫిక్ రూల్స్పై అవగాహన పెంచుకోవాలి : వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి

ట్రాఫిక్ రూల్స్పై అవగాహన పెంచుకోవాలి : వరంగల్ కలెక్టర్  డాక్టర్ సత్య శారద దేవి
  • వరంగల్​ కలెక్టర్  డాక్టర్​ సత్య శారద దేవి 

కాశీబుగ్గ, వెలుగు: వాహనదారులు ట్రాఫిక్​ నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని వరంగల్​ కలెక్టర్​ డాక్టర్​ సత్య శారద దేవి సూచించారు. శుక్రవారం వరంగల్  జిల్లా జక్కలొద్ది గ్రామంలోని టీజీఎంఆర్ఈఐఎస్  స్కూల్​లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించాలని, దీంతో ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. హెల్మెట్  ధరించడం, సీటు బెల్ట్ వినియోగం, పాదచారుల భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్‌‌‌‌ను పాటించాలన్నారు. 

చిన్నప్పటి నుంచే ట్రాఫిక్​ రూల్స్​పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు భద్రతను ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అడిషనల్​ కలెక్టర్  సంధ్యారాణి, ఆర్డీవో సుమ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రమేశ్, డీఈవో రంగయ్య నాయుడు, ఎంవీఐ జైపాల్ రెడ్డి, మామునూరు ఎస్సై శ్రీకాంత్, తహసీల్దార్  ఇక్బాల్, ప్రిన్సిపాల్  భిక్షపతి పాల్గొన్నారు.