గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ మృతి.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఘటన

గుండెపోటుతో   మాజీ ఎంపీటీసీ మృతి.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఘటన

నల్లబెల్లి, వెలుగు: గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ, మృతి చెందాడు. వరంగల్​జిల్లా దుగ్గొండి మండలం దేశాయపల్లికి చెందిన జిల్లెల్ల సాయికుమార్(45), గతంలో బీఆర్ఎస్ నుంచి దుగ్గొండి ఎంపీటీసీగా చేశాడు. శనివారం అర్ధరాత్రి ఇంట్లో అతడు బాత్రూమ్ కు వెళ్లి వచ్చి..  నిద్రపోతూ తనకు చాతిలో బాగా నొప్పిగా ఉందని భార్య రమకు చెప్పాడు. 

నొప్పిని తట్టుకోలేకపోతున్నానని చెప్పడంతో ఆమె కేకలు వేసింది. సమీపంలో ఉండే అతని తమ్ముడు వచ్చి సీపీఆర్​చేసినా.. కదలకపోవడంతో దుగ్గొండిలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. నాడీ కొట్టుకోవడంలేదని గుండెపోటు గురై ఉండొచ్చని చెప్పడంతో వరంగల్​ఎంజీఎంకు తీసుకెళ్లగా అప్పటికే సాయికుమార్​చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. సాయికుమార్ మృతితో కుటుంబసభ్యులు బోరున విలపించారు. బాధిత కుటుంబాన్ని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి పరామర్శించి రూ. 20 వేల ఆర్థిక సాయం అందించారు.