హాస్టల్ విద్యార్ధి అదృశ్యం.. వరంగల్ జిల్లా ఐనవోలులో ఘటన

హాస్టల్ విద్యార్ధి అదృశ్యం.. వరంగల్ జిల్లా ఐనవోలులో ఘటన

వర్దన్నపేట, వెలుగు: వరంగల్​ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్  వద్ద ఉన్న ఐనవోలు మహాత్మా  జ్యోతిబా ఫూలే హాస్టల్  నుంచి  శుక్రవారం తెల్లవారుజామున ఏడో తరగతి చదువుతున్న అన్విత్​ అదృశ్యమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. 

హన్మకొండ జిల్లా హసన్​పర్తి మండలం వంగపహాడ్​ గ్రామానికి చెందిన అన్విత్, ఐనవోలు మండలం తిమ్మాపూర్ కు  చెందిన విగ్నేశ్  స్కూల్  నుంచి బయటకు వెళ్లారు. విగ్నేశ్​ ఇంటికి వెళ్లగా, అతడిని హాస్టల్​కు తీసుకొచ్చారు. 

అన్విత్  మాత్రం హాస్టల్ కు తిరిగి రాకపోవడంతో పేరెంట్స్​కు సమాచారం అందించారు. బంధువులు, ఇతర చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో స్కూల్​ ప్రిన్సిపాల్​ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అన్విత్​ ఆచూకీ తెలుసుకునేందుకు సీసీ పుటేజీని పరిశీలిస్తున్నామని వర్దన్నపేట ఎస్సై సాయిబాబు తెలిపారు.