వరంగల్ ఎనుమాముల మార్కెట్ పరిధిలో కల్తీ కారంపొడి తయారీ ముఠా గుట్టురట్టు...

వరంగల్ ఎనుమాముల మార్కెట్ పరిధిలో  కల్తీ కారంపొడి తయారీ ముఠా గుట్టురట్టు...

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​ ఎనుమాముల మార్కెట్ పరిధిలో  కల్తీ  కారం పొడి  తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను   వరంగల్​ ఫుడ్​ సేప్టీ, పోలీసులతో కలిసి బుధవారం పట్టుకున్నారు.  

పనికిరాని మిర్చీ తొడిమెలతో  కారం పొడి తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.  సుమారుగా 70 బస్తాల కల్తీ పొడిని స్వాధీనం చేసుకొని,  వ్యాపారి పై కేసు నమోదు చేశారు. అధికారులు  కృష్ణమూర్తి, మౌనిక, ఎనుమాముల సీఐ సురేష్​ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.