జన్ విశ్వాస్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య

జన్ విశ్వాస్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఎంపీ డాక్టర్  కడియం కావ్య

గ్రేటర్​ వరంగల్, వెలుగు: జన్ విశ్వాస్  సవరణ బిల్లును లోక్‌‌‌‌సభలో శుక్రవారం వరంగల్  ఎంపీ డాక్టర్  కడియం కావ్య వ్యతిరేకించారు. వ్యాపార సౌలభ్యం పేరుతో తీసుకొస్తున్న ఈ బిల్లులో పలు కీలక నిబంధనలను డీక్రిమినలైజ్  చేయడం వల్ల నియంత్రణ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రత్యామ్నాయ అమలు విధానాలు బలంగా లేకుండా, చట్టపరమైన శిక్షలను తగ్గించడం వల్ల ఉల్లంఘనలు పెరిగే అవకాశం ఉందన్నారు. 

ప్రజారోగ్యం, పర్యావరణం, కార్మిక హక్కుల వంటి కీలకరంగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఎంపీ హెచ్చరించారు. ఇలాంటి కీలక సవరణలపై విస్తృత చర్చ జరిపి, అన్నివర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ డిమాండ్  చేశారు.