వరంగల్‌ కు కొత్త ఐటీఐలు ఎక్కడ? : ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్‌ కు కొత్త ఐటీఐలు ఎక్కడ? : ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కాశీబుగ్గ, వెలుగు: తెలంగాణ లోని ఐటీఐలు, ఎన్‌ఎస్‌టీఐల స్థితిగతులు, వాటి ఆధునీకరణ అవసరంపై వరంగల్ ఎంపీ డాక్టర్​ కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. ముఖ్యంగా వరంగల్ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని ఎంపీ కావ్య కోరారు. నైపుణ్యాభివృద్ధి కేంద్ర సహాయక శాఖ మంత్రి జయంత్ చౌదరి సమాధానమిస్తూ, రాష్ట్రంలో 301 ఐటీఐలు పనిచేస్తున్నాయని, అందులో వరంగల్‌లో 30 ఉన్నాయని తెలిపారు.

కీలక అంశమైన కొత్త ఐటీఐలు, ఎన్‌ఎస్‌టీఐల స్థాపనపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. వరంగల్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతానికి కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదని యువతకు ఆధునిక నైపుణ్యాలు అందించడంలో స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ కావ్య కోరారు.