భద్రకాళి టెంపుల్​ ఎదుట తాత్కాలిక కుంట ఏర్పాటు

భద్రకాళి టెంపుల్​ ఎదుట తాత్కాలిక కుంట ఏర్పాటు

వరంగల్ ​సిటీ, వెలుగు: అక్టోబర్ 3, 5 తేదీల్లో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని మేయర్  గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా హెడ్డాఫీసులో ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమై సివిల్, ఎలక్ట్రికల్, తాగునీటి సప్లై ... తదితర ఏర్పాట్లపై రివ్యూ చేశారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్​ వరంగల్​పరిధిలోని 66 డివిజన్లలో ఈనెల 25న ఎంగిలి పూల బతుకమ్మ, అక్టోబర్ 3, 5 తేదీల్లో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. బతుకమ్మ మొదటి రోజు ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

సద్దుల బతకమ్మ ఉత్సవాలు జరిగే ఏరియాల్లోనూ నేల చదును చేయడం, చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించడం, రోడ్ల రిపేర్లు, లైటింగ్, సీసీ కెమెరాలు.. వంటి పనులను ఈ నెల 27లోగా పూర్తి చేయాలని అధికారులను మేయర్, కమిషనర్​ఆదేశించారు. దసరా ఉత్సవాలు జరిగే రంగలీలా మైదానం, చిన్నవడ్డేపల్లి చెర్వు, సిద్దేశ్వర గుండం, ఖిలా వరంగల్ రంగంపేట, శివనగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని  ఆదేశించారు. రివ్యూలో ఎస్ఈ ప్రవీణ్ చంద్ర , అడిషనల్ కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, సీఎంహెచ్ఓ జ్ఞానేశ్వర్, డిప్యూటీ కమిషనర్​ జోనా, డీఈ  శ్రీనివాస్ రెడ్డి, ఈఈలు, ఏఈ లు  తదితరులు పాల్గొన్నారు.

భద్రకాళి టెంపుల్​ ఎదుట తాత్కాలిక కుంట ఏర్పాటు 

వరంగల్​సిటీ, వెలుగు: బతుకమ్మల నిమజ్జనానికి  భద్రకాళి దేవాలయం ఎదురుగా కీర్తి గార్డెన్ పక్కన పార్కింగ్ ప్రదేశంలో తాత్కాలికంగా కుంటను వెంటనే ఏర్పాటు చేయాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ భద్రకాళి దేవాలయం ముందు ప్రదేశాన్ని పరిశీలించారు.