న్యూ ఇయర్‌‌ సెలబ్రేషన్స్‌‌ రాత్రి 12.30 గంటల వరకే

న్యూ ఇయర్‌‌ సెలబ్రేషన్స్‌‌  రాత్రి 12.30 గంటల వరకే
  • కమిషనరేట్‌‌ పరిధిలో విస్తృతంగా డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌ టెస్ట్‌‌లు
  • డ్రగ్స్ వాడినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు
  • ఈవెంట్స్‌‌ నిర్వహణకు తప్పనిసరిగా పర్మిషన్‌‌ తీసుకోవాలి
  • వరంగల్‌‌ సీపీ అంబర్‌‌ కిశోర్‌‌ ఝా

హనుమకొండ, వెలుగు : న్యూ ఇయర్‌‌ సెలబ్రేషన్స్‌‌ను 31వ తేదీ రాత్రి 12.30 గంటల వరకే నిర్వహించుకోవాలని వరంగల్‌‌ పోలీస్‌‌ కమిషనర్‌‌ అంబర్‌‌ కిశోర్‌‌ ఝా చెప్పారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎవరైనా డ్రగ్స్‌‌ వాడినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యూ ఇయర్‌‌ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులతో పాటు ట్రాఫిక్‌‌, టాస్క్‌‌ఫోర్స్‌‌, క్రైమ్‌‌, షీటీమ్స్‌‌ ఇతర విభాగాల సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్‌‌ నిర్వహిస్తారన్నారు. 

కమిషనరేట్‌‌ వ్యాప్తంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌ టెస్టులు నిర్వహిస్తామని చెప్పారు. ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుందని హెచ్చరించారు. వెహికల్స్‌‌ను స్పీడ్‌‌గా నడిపినా, ఇతరులకు ఇబ్బందులు కలిగించినా సీరియస్‌‌ యాక్షన్‌‌ ఉంటుందన్నారు. ట్రాఫిక్‌‌ సమస్యలు తలెత్తకుండా ముమ్మర గస్తీ నిర్వహిస్తామన్నారు.

ప్రజాపాలన సెంటర్ల పరిశీలన

వరంగల్‌‌ మున్సిపల్‌‌ స్టేడియం, దేశాయిపేటలో ని ప్రజాపాలన కేంద్రాలను శుక్రవారం సీపీ పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ  మాట్లాడుతూ దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట వరంగల్‌‌ ఏసీపీ బోనాల కిషన్ ఉన్నారు.

ఈవెంట్లకు పర్మిషన్‌‌ తప్పనిసరి

న్యూ ఇయర్​ సందర్భంగా ఈవెంట్లు నిర్వహించే వారు తప్పనిసరిగా పోలీసుల నుంచి పర్మిషన్‌‌ తీసుకోవాలని ఆదేశించారు. పర్మిషన్‌‌ లేకుండా ఎవరైనా ఈవెంట్లు పెట్టినా, సెలబ్రేషన్స్‌‌ పేరుతో అశ్లీల డ్యాన్స్‌‌ ప్రోగ్రామ్స్‌‌ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రోగ్రామ్స్‌‌ నిర్వహించే ప్లేస్‌‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. వేడుకలు నిర్వహించే టైంలో ట్రాఫిక్‌‌ ఇబ్బందులు తలెత్తినా, చుట్టుపక్కల ఇండ్ల వారికి ఇబ్బందులు కలిగించినా చర్యలు తప్పవన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే  87126  85257 నంబర్‌‌కు సమచారం ఇవ్వాలని సూచించారు. న్యూ ఇయర్‌‌ వేడుకలను ప్రశాంత వాతావరణంలో, కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని సూచించారు.