ప్రవళికది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వ హత్యే: పొన్నం ప్రభాకర్

ప్రవళికది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వ హత్యే: పొన్నం ప్రభాకర్

వరంగల్ విద్యార్థిని ప్రవళికది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల సెంటిమెంట్ కోసం హుస్నాబాద్ ను వాడుకుంటున్న సీఎం కేసీఆర్.. సెంటిమెంట్ కు సమానంగా హుస్నాబాద్ ను ఎందుకు అభివృద్ధి చేయలేదని పొన్నం నిలదీశారు.

2014కు ముందే 70% పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టును కూల్చివేసి.. పూర్తి చేస్తాని సీఎం కేసీఆర్ ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదో బహిరంగ సభలో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్బంధాల మధ్య భూ నిర్వాసితులను అణిచివేసి.. గౌరవెల్లి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదన్నారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల లాగా హుస్నాబాద్ ను ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలని అన్నారు. 

బీఆర్ఎస్, బీజేపీలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రజలను మభ్యపెట్టడానికి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో దిమ్మ తిరిగేలా ఉంటుందంటున్న తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు దిమ్మతిరిగే తీర్పు ఇస్తారని తెలిపారు. ప్రజలంతా బీఆర్ఎస్ తాయిలాలు తీసుకొని ఎన్నికల్లో మాత్రం ఓటుతో మార్పుకు పట్టం కట్టాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. 

ALSO READ : హ‌మాస్ వైమానిక ద‌ళ నేత హ‌తం.. ఇజ్రాయిల్ కీలక ప్రకటన