పోలీసుల వేధింపులకు యువకుడి మృతి

పోలీసుల వేధింపులకు యువకుడి మృతి

వరంగల్ జిల్లాలో పోలీసుల దాష్టీకం వెలుగులోకి వచ్చింది. దొంగతనం కేసును ఒప్పుకోవాలని ఒ యువకున్ని  పోలీసులు చితకబాదారు. గిసుగొండ మండలం వంచనగిరిలో బంధువుల ఇంట్లో 5 తులాల బంగారం దొంగతనం చేసాడని.. పోలం వంశీ (21) పై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ కేసులో గత ఐదు రోజుల నుండి అతన్ని  పోలీసులు విచారిస్తున్నారు. అయితే తాను ఈ దొంగతనం చేయలేదని సీఐకి చెప్పినా.. ఆయన వినిపించుకోలేదు. 

దొంగతనం కేసు ఒప్పుకోవాలని వంశీని పోలీసులు వేధించారు. చేయని దొంగతనానికి తనని తీవ్రంగా కొట్టారని మనస్తాపం చెందిన అతడు.. సీఐ ముందే పురుగుల మందు తాగిన ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే పోలీస్ జీపులో వరంగల్ ఎంజీఎంకి అతన్ని తరలించారు. వంశీ ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీఐ, ఎస్సై  వేధింపుల వల్లే పురుగుల మందు తాగాడని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.