గ్రేటర్ వరంగల్: అభివద్ధి పనులకు శంకుస్థాపన

గ్రేటర్ వరంగల్: అభివద్ధి పనులకు శంకుస్థాపన

గ్రేటర్​ వరంగల్, వెలుగు: సిటీలోని 47వ డివిజన్ లో వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం రూ.125 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 47 వ డివిజన్​లో రూ.6 కోట్ల పై చిలుకు అభివృద్ధి చేశామని, కాజీపేటలో గత పాలనలో ఎలా ఉందో ఇప్పుడెలా ఉందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అనంతరం ఎస్ఐఆర్ బూత్ ఏజెంట్ల పక్రియ వేగవంతం చేయాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు.