ఆర్వోబీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఆర్వోబీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

 

కాజీపేట, వెలుగు: కాజీపేటలోని ఫాతిమానగర్ నూతన ఆర్వోబీ బ్రిడ్జి నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఆర్వోబీ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి వన్​ సైడ్ పనులు పూర్తయ్యాయని, మరో సైడ్ పూర్తికావాల్సి ఉందని తెలిపారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలోపు పాత బ్రిడ్జిని వాడుకోవడానికి మరమ్మతులు చేయడానికి రూ.59 లక్షలను సీఎంతో మాట్లాడి శాంక్షన్ చేయించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. 

పాత బ్రిడ్జి ప్రహరీ, రోడ్లపై ఏర్పడ్డ గుంతలను శాశ్వతంగా పూడ్చడానికి ఈ నిధులతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, కాంగ్రెస్ నాయకులు పసునూరి మనోహర్, మహమ్మద్ అంకూస్, ఇప్ప శ్రీకాంత్ పెరుమాండ్ల రామకృష్ణ, ఎంవీరాజు, పాలడుగుల అంజనేయులు ఉన్నారు.