వరంగల్, వెలుగు: ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు డివిజన్ల బాట పట్టానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అన్నారు.
ఆదివారం ఆయన 58వ డివిజన్ పరిధిలోని ఎన్జీఓస్ కాలనీ, వడ్డెపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 26 డివిజన్లవారీగా ప్రజల మధ్య పర్యటిస్తూ, సమస్యల పరిష్కరానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి పనులు చేపడుతున్నామన్నారు.
