బిల్లులిస్తలేరని జీపీకి తాళం వేసిండు

బిల్లులిస్తలేరని జీపీకి తాళం వేసిండు

నర్సింహులపేట/దంతాలపల్లి, వెలుగు: గ్రామాభివృద్ధికి అప్పులు తెచ్చి వర్కులు చేస్తే బిల్లులు ఇస్తలేరంటూ వార్డుసభ్యుడు పంచాయతీ ఆఫీసుకు తాళం వేశాడు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి జీపీ 12వ వార్డుసభ్యుడు కిషన్ మూడేండ్ల క్రితం గ్రామంలో మట్టి పనులు చేశాడు. ఎంతకూ బిల్లులు రాకపోవడంతో బుధవారం సర్పంచ్, వార్డుసభ్యులు, సెక్రటరీని జీపీలో నిర్బంధించి గేటుకు తాళం వేశాడు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపాడు. అప్పులు తెచ్చి మరీ వర్క్ చేస్తే   బిల్లులు చెల్లించకుండా ఆఫీసర్లు, లీడర్లు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు కిషన్​కు నచ్చజెప్పి తాళం తీయించారు.