తీయండ్రా స్వెట్టర్లు : హైదరాబాద్కు చలికాలం వచ్చేసింది..

తీయండ్రా స్వెట్టర్లు : హైదరాబాద్కు చలికాలం వచ్చేసింది..

హైదరాబాద్ కూల్ వెదర్ లోకి వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతు పవనాలు పూర్తిగా వెళ్లిపోనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే అక్కడక్కడ చదురు మదురు వర్షాలు పడతాయని.. ఇక వర్షాకాలం పూర్తిగా ముగిసిపోయినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వివరించింది వాతావరణ శాఖ. ఇప్పటికే ఉదయం ఎండలు పెరిగాయి.. 31 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇదే విధంగా కొనసాగనున్నట్లు వెదర్ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. 

ఈ క్రమంలోనే హైదరాబాద్ లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. 20 నుంచి 21 డిగ్రీలుగా నమోదవుతుంది. రాత్రులు చల్లటి వాతావరణ ఉంటుంది. తేమ స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం హైదరాబాద్ లో 68 శాతం తేమ నమోదైంది.  అక్టోబర్ 15వ తేదీ తర్వాత.. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తుంది వెదర్ డిపార్ట్ మెంట్. నవంబర్ నెలలోనే 15 డిగ్రీలకు పడిపోతున్నట్లు తెలిపింది. 

ALSO READ : అందమే ఆయువు తీసింది : ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ప్రముఖ నటి చనిపోయింది

ఈ క్రమంలో మనకు గుర్తు కొచ్చేవి స్వెట్టర్లు.. భద్రపరుచుకున్నవి అయితే బయటికి తీసి చలిపై పోరాటానికి సిద్దం చేస్తాం.. లేకపోతే మార్కెట్లో కి వచ్చిన కొత్త స్వెట్టర్లను కొనుగోలు చేస్తాం.  హైదరాబాద్ నగరంలో స్వెట్టర్లకు కోఠీ, చాదర ఘాట్ ప్రసిద్ది. ఇక్కడికి దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి స్వెట్టర్లు తెచ్చి విక్రయిస్తుంటారు.