అందమే ఆయువు తీసింది : ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ప్రముఖ నటి చనిపోయింది

అందమే ఆయువు తీసింది : ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ప్రముఖ నటి చనిపోయింది

మాజీ అందాల రాణి, నటి జాక్వెలిన్ క్యారీరీ(48) సౌందర్య సాధనాల వల్ల కలిగే సమస్యల ఫలితంగా రక్తం గడ్డకట్టినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

అర్జెంటీనాకు చెందిన జాక్వెలిన్.. 1996లో శాన్ రాఫెల్ ఎన్ వెండిమియా గ్రేప్ హార్వెస్ట్ ఫెస్టివల్‌లో అందాల పోటీలో రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉన్న ఇద్దరు పిల్లల తల్లి అయిన జాక్వెలిన్ అక్టోబర్ 1న మరణించింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన బంధువులు షేర్ చేశారు. "పుంటా డెల్ అగువా జిల్లా రాణి, 1996లో శాన్ రాఫెల్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ క్వీన్‌గా ఉన్న జాక్వెలిన్ క్యారీరి మరణించారు" అని పోస్టు ద్వారా తెలియజేశారు.

ALSO READ : ఎమ్మెల్యే షకీల్కు నిరసన సెగ.. కాన్వాయ్ని అడ్డుకున్న గ్రామస్తులు

జాక్వెలిన్ పిల్లలు క్లో, జూలియన్ ఆమెతో పాటు అమెరికాలో ఉన్నారని అర్జెంటీనా మీడియా ఈ సందర్భంగా తెలిపింది. జాక్వెలిన్ ఏ కాస్మెటిక్ సర్జరీ చేశారో, ఏ క్లినిక్‌లో చేశారో అన్న విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. జాక్వెలిన్ సోషల్ మీడియా పేజీ ప్రకారం, ఆమె బ్యూనస్ ఎయిర్స్ సమీపంలోని లోమాస్ డి జమోరా నేషనల్ యూనివర్శిటీలో చదువుకుంది.