ప్రభాస్ను ముంచినట్లు..ఎన్టీఆర్ను కూడా ముంచేయరుగా!

ప్రభాస్ను ముంచినట్లు..ఎన్టీఆర్ను కూడా ముంచేయరుగా!

హాలీవుడ్‌లో మార్వెల్ సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉందో..బాలీవుడ్‌లో YRF స్పై యూనివర్స్ ఫ్రాంచైజ్‌కు అంతే క్రేజ్ ఉంది. అయితే YRF స్పై యూనివర్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో హృతిక్ రోషన్‌తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కోసం.. ఆయన అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు..అదే స్థాయిలో భయపడుతున్నారు. 

అసలు విషయానికి వస్తే..ఆర్ఆర్ఆర్(RRR) సూపర్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్(Ntr) క్రేజ్ గ్లోబల్ వైడ్గా నెక్స్ట్ లెవల్కు చేరుకుంది. ఆయన తరువాతి సినిమాలపై కూడా ఆసక్తి నెలకొంది. దీంతో వార్ 2 మూవీ ఎలా ఉండనుందో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రీసెంట్గా భారీ అంచనాల మధ్య రిలీజైన సల్మాన్ టైగర్ 3 మూవీ ఆశించినంత స్థాయిలో లేకపోవడమే.

ఒక్కప్పుడు అంటే బాలీవుడ్ యాక్షన్ సినిమాలను జనాలు ఎగబడి చూసేవారు.  అప్పుడు ఆ రేంజ్లో వాళ్ళ పప్పులు ఉడికేవీ. అయితే ఇప్పుడు మాత్రం అంతకుమించిన యాక్షన్ సినిమాలతో మన తెలుగు డైరెక్టర్స్ వస్తున్నారు. 

కాగా గతంలో సల్మాన్ టైగర్ ప్రాంచైజీలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలు బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. కానీ టైగర్ 3లో మాత్రం కొత్త తరహా కంటెంట్ అంతగా ఏమి లేదు. దీంతో ఈ సినిమాకు చాలా చోట్ల నెగిటివ్ టాక్ వస్తోంది. దీంతో వార్ 2 ఎలా ఉంటుందో అనే ఊహాగానాలు ఎన్టీఆర్ అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఎంటో మరి..ప్రభాస్ ను అది పురుష్ మూవీతో ముంచినట్లు ఎన్టీఆర్ను కూడా ముంచేయరుగా..అంటూ నెటిజన్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి. 

ఎన్టీఆర్..ప్రస్తుతం కొరటాల శివ (Karatala Shiva) దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో దేవర మూవీ చేస్తున్నారు. జాన్వీ కపూర్ (Janhvi kapoor) హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా..వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.