వారెన్‌ బఫెట్‌ ఇంకా కొనట్లే..

వారెన్‌ బఫెట్‌ ఇంకా కొనట్లే..

వాషింగ్టన్‌‌: గ్లోబల్‌‌గా ఈక్విటీ మార్కెట్లు ఇంకా బాటమ్ ఔట్‌‌ కాలేదని సీనియర్‌‌‌‌ ఇన్వెస్టర్‌‌‌‌ వారెన్‌‌ బఫెట్‌‌ భావిస్తున్నట్టుంది. కొన్ని కంపెనీలలో ఆయనకున్న ఈక్విటీ షేర్లను అమ్మేసి డబ్బులను సమీకరిస్తున్నారు. కానీ వీటితో తిరిగి షేర్లను కొనడం లేదు. ఆయన కంపెనీకి చెందిన షేర్లను బై బ్యాక్‌‌ చేయడం నుంచి కూడా వెనక్కి తగ్గారు. మార్చి చివరినాటికి ఆయన137 బిలియన్‌‌ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఏప్రిల్‌‌ నెలలో మరో 6 బిలియన్‌‌ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు.

తన దగ్గర డబ్బులున్నప్పటికి ఏప్రిల్‌‌ నెలలో కేవలం 1.8 బిలియన్‌‌ డాలర్ల విలువైన షేర్లనే తిరిగి కొనుగోలు చేశారు. ఎయిర్‌‌‌‌లైన్‌‌ షేర్లను వదిలించుకుంటున్నారు. కాగా కరోనా దెబ్బతో అమెరికా స్టాక్‌‌ మార్కెట్లు భారీగా నష్టపోతున్న విషయం తెలిసిందే. దీంతో క్వాలిటీ స్టాకులన్ని ఆకర్షణీయంగానే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఆయన షేర్లనుకొనడం లేదు. మార్కెట్లు పడుతున్నప్పుడు అడ్వాంటేజ్‌‌ తీసుకోమని ఇన్వెస్టర్లకు బఫెట్‌‌ సలహాయిస్తారని ఓ ఎనలిస్ట్‌‌ చెప్పారు. మార్కెట్లు పడుతున్న టైమ్‌‌లో మిగిలిన వారు భయపడుతుంటే మనం ఆశపడాలని చెబుతుంటారని అన్నారు.