సరైన ఏరియాలో బాల్స్‌‌ వేయడం వల్లే వికెట్లు పడ్డయ్

సరైన ఏరియాలో బాల్స్‌‌ వేయడం వల్లే వికెట్లు పడ్డయ్
  • అశ్విన్​తో కివీస్​ స్పిన్నర్​ అజాజ్​ పటేల్​​

ముంబై: ఇండియాతో సెకండ్​ టెస్ట్​ ఫస్ట్​ ఇన్నింగ్స్​లో పదికి పది వికెట్లు పడగొట్టడం తన అదృష్టమని కివీస్​ స్పిన్నర్​ అజాజ్​ పటేల్​ అన్నాడు. సెకండ్ టెస్టు తర్వాత బీసీసీఐ టీవీ కోసం అజాజ్​ను అశ్విన్​ ఇంటర్వ్యూ చేశాడు. ఏడేళ్లప్పుడు ముంబైని వదిలి ఫ్యామిలీతో  న్యూజిలాండ్‌‌ వెళ్లడం, సీమర్‌‌ నుంచి స్పిన్నర్‌‌గా  మారడంతో పాటు సెకండ్‌‌ టెస్ట్‌‌లో అనూహ్యంగా ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో ప్లేస్‌‌ దక్కించుకోవడం గురించి అశ్విన్‌‌కు అజాజ్‌‌ వివరించాడు. ఈ క్రమంలో పది వికెట్ల వెనుక సీక్రెట్ ఏదైనా ఉందా? అని అజాజ్‌‌ను ఇండియా స్టార్‌‌ ప్రశ్నించాడు. ఈ ఘనత సాధించడం తన అదృష్టమన్న  పటేల్​.. సరైన ఏరియాలో బాల్స్‌‌ వేయడం వల్లే వికెట్లు వచ్చాయని చెప్పాడు. తర్వాత పటేల్‌‌కు అశ్విన్‌‌ స్పెషల్‌‌ గిఫ్ట్‌‌ ఇచ్చాడు. టీమిండియా ప్లేయర్లంతా సంతకాలు చేసిన తన జెర్సీని అతనికి  అందజేశాడు. అజాజ్‌‌ బౌలింగ్‌‌ను డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌ నుంచి చాలా ఎంజాయ్‌‌  చేశానన్నాడు. తనకు గౌరవంగా జెర్సీని ఇస్తున్నట్టు అశ్విన్​ చెప్పాడు.