అభివృద్ధి పేరుతో దోబీఘాట్లను ఆక్రమించుకుంటున్నారు

అభివృద్ధి పేరుతో దోబీఘాట్లను ఆక్రమించుకుంటున్నారు
  • బీఎస్పీ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట రజకుల ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వాపురం మండలం మొండికుంటలో అభివృద్ధి పేరుతో రజకుల దోబీ ఘాట్లను ప్రభుత్వం ఆక్రమించుకుంటోందని కొత్తగూడెం కలెక్టరేట్ ముందు రజక కులస్తులు ధర్నా నిర్వహించారు. బహుజన సమాజ్ వాది పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. 2005 సంవత్సరంలో 40 కుటుంబాలు మొండికుంటలో 11 ఎకరాల్లో దోభీఘాట్లు ఏర్పాటు చేసుకొని బట్టలు ఉతుక్కుని జీవిస్తున్నామని తెలిపారు. రజక కుల ఆరాధ్య దైవమైన మడేల్ స్వామి గుడిని కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు. 
ఎంతోకాలంగా ఉపయోగించుకుని జీవిస్తున్న ఈ స్థలంపై కొందరు అధికార పార్టీ నేతల కన్ను పడిందని.. వారి ప్రోద్భలంతో పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక నిర్మాణం కోసం రోడ్ల నిర్మాణం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దోబిఘాట్లు లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.