వాచ్ ధర కోటి రూపాయలా? అవాక్కవుతున్న నెటిజన్స్

వాచ్ ధర కోటి రూపాయలా? అవాక్కవుతున్న నెటిజన్స్

సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ అంటేనే లగ్జరీగా ఉంటుంది. కాస్ట్లీ కార్లు, రిచ్ బంగ్లాలు, బ్రాండెడ్ వస్తువులు.. ఇలా ఏది చూసినా హాయ్ లెవల్ మెయింటనెన్స్ ఉంటుంది. ఇందుకోసం కోట్లలో ఖర్చు చేస్తూ ఉంటారు. అందుకే వాటి గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఆడియన్స్. ఇక తాజాగా రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ కూడా అలాగే టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.  

ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన పాపకు జన్మనిచ్చిన సంగతి  తెలిసిందే. పాపని, ఉపాసనని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసే సమయంలో రామ్ చరణ్ అపోలో హాస్పిటల్ బయట ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆ సమయంలో చరణ్ పెట్టుకున్న వాచ్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వాచీ రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందింది. ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్ లను ఉత్పత్తి చేసే సంస్థ. ఈ వాచ్ ధర దాదాపు 2 లక్షల డాలర్లు ఉంటుందని సమాచారం. అంటే మన కరెన్సీలో దాదాపు కోటి 40 లక్షలకు పైనే ఉంటుంది. ఈ విషయం తెసులుకున్న నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. కేవలం ఒక్క వాచ్ ఖరీదు కోటి రూపాయాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.