అమరావతిలో నీళ్ల కరువు

అమరావతిలో నీళ్ల కరువు

మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాల్లో నీళ్ల కష్టాలు అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. విదర్భలోని అమరావతి జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. తాగడానికి కూడా అక్కడ నీళ్లు దొరకడం లేదు. ఏళ్లు గడుస్తున్నా తమ బాధలు తీరడం లేదంటున్నారు అక్కడి మహిళలు.

అన్నం తినకుండా కొంతకాలం ఉండమంటే ఉండగలం కానీ… నీళ్లు లేకుండా బతకడం కష్టం అంటున్నారు అక్కడి మహిళలు. రోజుకు 4 గంటల పాటు కష్టపడితే కానీ నీళ్లు దొరకడం లేదంటున్నారు. ప్రభుత్వం తమ కోసం ఏమీ చేయడం లేదంటున్నారు.