భూమి పొరల్లో ఖాళీ లేనంత వాన.. వికారాబాద్ జిల్లాలో బోరు బావుల నుంచి ఉబికి వస్తున్న నీరు

భూమి పొరల్లో ఖాళీ లేనంత వాన.. వికారాబాద్ జిల్లాలో బోరు బావుల నుంచి ఉబికి వస్తున్న నీరు

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు దంచి కొడుతుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు భూమి పొరల్లో ఖాళీ లేనంతగా నీరు చేరిపోయింది. దీంతో బోరు బావుల నుంచి నీరు ఉబికి వస్తోంది. చాలా ఏండ్ల తర్వాత బోరు బావుల నుంచి నీరు ఉబికి రావటాన్ని చూసి అతి వృష్టి అంటున్నారు రైతులు. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి, మొక్కజొన్న, వరి, కంది పంట పొలాలు  నీట మునిగాయి. వాగులు తీవ్ర రూపం దాల్చి ప్రవహిస్తుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.  గ్రామాల్లో పొంగి పొర్లుతున్న వాగులను దాటేందుకు పాడి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో రోడ్లు, పలు గ్రామాలు  జలమయమయ్యాయి. లక్నాపూర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. మరోవైపు పరిగి పెద్ద వాగు బుధవారం రాత్రి (ఆగస్టు 13) నుండి పొంగి పొర్లుతోంది.  దోమ మండలంలోని గొడుగోనిపల్లి, పాలేపల్లి వాగులు రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. 

ALSO READ : మందు బాబులకు గుడ్ న్యూస్

వరద ఉధృతికి  పరిగి మండలం నారాయణ పూర్ లో ట్రాన్స్ఫార్మర్  నేలకొరిగగా, కల్వర్టు పూర్తిగా ద్వంసమై బీటీ రోడ్డు కొట్టుకు పోయింది. భఃకుండపోత వర్షాలతో వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డిలు పరిశీలించారు.  ఈ పరిస్థితుల్లో రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.