ఈ ఏడాది నీటి కష్టాలు ఎందుకు.?

ఈ ఏడాది నీటి కష్టాలు ఎందుకు.?

తెలంగాణలో  సాగునీటి ప్రాజెక్టుల్లో డేంజర్​ బెల్స్​ మోగుతున్నాయి. రాష్ట్రంలో నిరుడు అక్టోబర్​ నుంచి 54 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం, సూపర్​ ఎల్​నినో ఎఫెక్ట్​తో  మార్చిలోనే  ఎండలు మండిపోతుండటంతో  ప్రధాన జలాశయాల్లోని వాటర్ ​లెవల్స్​ వేగంగా పడిపోతున్నాయి. గతేడాది మార్చితో పోలిస్తే కృష్ణా బెల్ట్​లో జూరాల నుంచి నాగార్జునసాగర్​ దాకా,  గోదావరి బెల్ట్​లో ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ దాకా అన్ని ప్రాజెక్టుల్లో నీటినిల్వలు గణనీయంగా తగ్గాయి. 

ఎందుకిలా?

రాష్ట్ర సగటు వర్షపాతం 906.3 మి.మీ. కాగా.. నిరుడు (2022–23) 1387.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే సగటుకన్నా 53 శాతం వర్షపాతం ఎక్కువ నమో దు కావడంతో కరువు ఛాయలు కనిపించలేదు. కానీ ఈ ఏడాది (2023–24) 914.9 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది.  మార్చి7 నాటి సగటు (866.7)తో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువే. కానీ  ‘సూపర్​ ఎల్​నినో ఎఫెక్ట్​’ వల్ల  ఈ ఏడాది అటు వర్షాల్లో, ఇటు ఎం డల్లో తీవ్ర వ్యత్యాసాలు తలెత్తుతున్నాయని వాతావర ణ నిపుణులు చెప్తున్నారు. ఈ ఏడాది వానకాలంలో  సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ఆ వర్షపాతమంతా కేవలం వారం

పది రోజుల్లోనే రికా ర్డు కావడం, ఆ తర్వాత వర్షాలే లేకపోవడంలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదాహరణకు నిరుడు అక్టోబ ర్‌‌, నవంబర్‌‌, డిసెంబర్‌‌ నెలల్లో కలిపి 113.20 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 52.70 మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. దీంతో 53.45 మి.మీ. లోటు నమోదైంది. అలాగే, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో కలిపి 12 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా వందశాతం లోటు ఉన్నట్టు రిపోర్టులు చెప్తున్నాయి.  ఈ తేడాల వల్లే ప్రాజెక్టుల్లో నీటి మట్టంతోపాటు గ్రౌండ్​వాటర్​లెవల్స్​ కూడా వేగంగా పడిపోతున్నాయి. సూపర్​ ఎల్​నినో ప్రభావం వల్లే

ఈసారి  ఎండాకాలం కూడా త్వరగా ప్రారంభమైందని నిపుణులు చెప్తున్నారు.  పసిఫిక్ మహాసముద్రంలో నవంబర్​, జనవరి మధ్య ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2  డిగ్రీలు ఎక్కువ నమోదు కావడంతో భారత్​ సహా వివిధ దేశాల్లో సూపర్​ ఎల్​నినో ప్రభావం ఉంటుందని నేషనల్​ ఓషియానిక్​ అట్మాస్పియరిక్​​ అడ్మినిస్ట్రేషన్​ (ఎన్​వోఏఏ) నిరుడు అక్టోబర్​లోనే అంచనా వేసింది. అందుకు తగ్గట్టే  ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొరుగున ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూర్​లోనూ తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్నట్టు వార్తలు వస్తున్నాయి.