హైదరాబాద్: హైదరాబాద్ సిటీకి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టు మెయిన్ పైప్ లైన్‌కి భారీ లీకేజీలు పడ్డాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం (జనవరి 17) రాత్రి 8 గంటల వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి తెలిపింది. మరోవైపు.. పైప్ లైన్ లీకేజీలను అరికట్టడానికి అధికారులు అత్యవసర మరమ్మత్తులు చేపట్టారు. టీఎజీ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 132 కేవీ కంది సబ్‌స్టేషన్ వద్ద పెద్దపూర్ ఫీడర్‌కు సంబంధించి ఏఎంఆర్ టీ టెస్టింగ్, హాట్ లైన్ రిమార్క్స్తోపాటు సాధారణ నిర్వహణ పనులు నిర్వహిస్తారు.
నీటి సరఫరా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
బంజారాహిల్స్, సోమాజిగూడ, వెంకటగిరి, యల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ, ఎస్పీఆర్ హిల్స్, కేపీహెచ్‌బీ, బోరబండ, గాయత్రి నగర్, మూసాపేట్, భరత నగర్, కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్, గోపాల్ నగర్, తెల్లాపూర్
