
హైదరాబాద్, వెలుగు : ఐఓటీ ఆధారిత వాటర్ ఫ్యూరిఫికేషన్ కమ్ బాటిలింగ్ యూనిట్‌ను వాటర్ హెల్త్ ఇండియా, పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ ద్వారా హోటల్‌కు వచ్చే అతిథులకు రీసైకిల్ అయ్యే గ్లాస్ బాటిళ్లలో మంచినీటిని అందజేస్తోంది. హాస్పిటాలిటీ రంగంపై తాము ఎక్కువగా ఫోకస్ చేశామని వాటర్ హెల్త్ ఇంటర్నేషనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వికాస్ షా చెప్పారు. ఇది కస్టమర్లకు క్వాలిటీ వాటర్‌ను అందజేస్తూ.. పర్యావరణానికి అనుకూలమైన విధానాలను ఆఫర్ చేయడంలో తమల్ని మార్కెట్ లీడర్‌గా నిలబెడుతుందని ఆశించారు. ఇండియాలో 50 నుంచి 70 హోటల్స్‌తో చర్చలు సాగుతున్నాయని, తమ యూనిట్‌ను ఏర్పాటు చేసిన తొలి హోటల్ ఇదేనని చెప్పారు. కార్పొరేట్స్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, ఇన్‌స్టిట్యూషన్స్, ఎస్‌ఎంఈలకు ప్లాస్టిక్ ఫ్రీ ఆప్షన్లను అందించడమే తమ లక్ష్యమన్నారు. కన్జూమర్లకు ఫ్యూరిఫైడ్ వాటర్ అందించడానికి ఇప్పటికే 13 రాష్ట్రాల్లో వెయ్యి యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో 50కి పైగా వాటర్ హెల్త్ సెంటర్లు, ఏపీలో 175 సెంటర్లున్నట్టు కంపెనీ హెడ్ బిజినెస్ ఆపరేషన్స్ భరద్వాజ్ తెలిపారు. గంటకు వెయ్యి లీటర్లను ఫ్యూరిఫై చేసే సామర్థ్యం తమకున్నట్టు వెల్లడించారు. ఒక్కో వాటర్ ప్లాంట్‌పై రూ.75 లక్షల నుంచి రూ.80 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు వెల్లడించారు. కన్జూమర్ వైపు అయితే ఒక్కో ప్లాంట్‌కు రూ.35 లక్షలు వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. హోటల్స్, హాస్పిటల్స్‌తో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. త్వరలోనే 300 యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు భరద్వాజ్ వెల్లడించారు. కన్జూమర్లకు ఇచ్చే 20 లీటర్ల ఫ్యూరిఫైడ్ వాటర్‌కు రూ.6 నుంచి రూ.8 మధ్యలో ఛార్జ్ చేస్తున్నామని, ఎస్‌ఎంఈలకు నెలకు రూ.10–50 వేల మధ్యలో ఛార్జ్ చేస్తున్నామన్నారు.