
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ కంపెనీ రాఘవ లగ్జరీ ప్రాజెక్ట్ వేవ్‌ను గురువారం లాంచ్ చేసింది. గచ్చిబౌలి దగ్గరలోని కొల్లూర్‌లో ఈ ప్రాజెక్ట్ కడుతున్నారు. మొత్తం 8.27 ఎకరాల్లో, నాలుగు టవర్ల కింద ప్రాజెక్ట్ పూర్తి చేయనున్నారు. ఒక్కో టవర్‌లో 36 ఫ్లోర్లు ఉంటాయి.
19 వ ఫ్లోర్లో స్కైబ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని రాఘవ ఓ స్టేట్మెంట్ పేర్కొంది. 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్లలో వరల్డ్ క్లాస్ సౌకర్యాలు ఉంటాయని వెల్లడించింది. అపార్ట్మెంట్ సైజ్ 1,660 చదరపు అడుగుల నుంచి 1,930 చదరపు అడుగుల మధ్య ఉంటుందని తెలిపింది.