Rahul Gandhi: వయనాడ్ వరద బాధితులకు ఇండ్లు కట్టిస్తాం: రాహుల్ గాంధీ

Rahul Gandhi: వయనాడ్ వరద బాధితులకు ఇండ్లు కట్టిస్తాం: రాహుల్ గాంధీ

వయనాడ్ వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ల్యాండ్ స్లైడ్స్ కారణంగా విధ్వంసానికి గురైన వయనాడ్ పరిధిలోని చురాల్ పరా, వెలారిమలా, ముండక్కయిలీ, పంచిరిమడోమ్ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. 

శుక్రవారం ఆగస్టు 2,2024 కూడా ల్యాండ్ స్లైడ్ తో ధ్వంసమైన గ్రామాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. స్థానిక అధికారులను కలుసుకొని నష్టం అంచనా వేశారు. ఈ భారీ విధ్వంసంలో నిర్వాసితులైన వారిని ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. 

వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో కలిసి వయనాడ్ లో పర్యటించారు. పంచిరిమడోమ, ముండకయిలీ ప్రాంతాలతోపాటు రీలిఫ్ క్యాంపులను సందర్శించారు. నేను గత రెండు రోజులుగా వయనాడ్ లో పర్యటిస్తున్నారు.. ఇది భయంకరమైన విపత్తు.. నిన్న వరద బాధిత  ప్రాంతాలకు వెళ్లాను. రిలీఫ్ క్యాంపులను సందర్శించాం. నష్టాన్ని అంచనా వేశాం.. ఇవాళ శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించి.. మృతుల సంఖ్య, గల్లంతయిన వారి ఆచూకీ , ఆస్తి నష్టం వంటి వివరాలను తెలుసుకున్నాం.. అధికారుల లెక్కల ప్రకారం వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. వయనాడ్ వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. ఈ భయంకర విపత్తులో ఇండ్లు కోల్పోయినవారికి 100 ఇండ్లు కట్టిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. 

మరోవైపు వయనాడ్ వరద విపత్తులో ఇప్పటివరకు 302 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు  206 మంది ఆయూకీ ఇంకా లభించలేదు. 1500 మంది రెస్క్యూ సిబ్బంది వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. చురాల్ పరా, వెలారిమలా, ముండక్కయిలీ, పంచిరిమడోమ్ వంటి ల్యాండ్ స్లైడ్ ప్రభావ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.