క్షేమంగా ఉన్నాం: చైనాలోని తెలుగు ఇంజనీర్లు

క్షేమంగా ఉన్నాం: చైనాలోని తెలుగు ఇంజనీర్లు

చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. ఈ క్రమంలో అక్కడున్న తెలుగు ఇంజినీర్ల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాలోని వుహాన్ నగరంలో తెలుగు ఇంజినీర్లు చిక్కుకుపోయారని….వారిని చైనా ప్రభుత్వం భారత్ కు రానివ్వకుండా అడ్డుకోవడంతో పాటు…నిర్బంధించారని ప్రచారం జరుగుతోంది. అయితే చైనా నుంచి తెలుగు ఇంజనీర్లు…ఇండియాకు ఓ సెల్ఫీ వీడియో ద్వారా మెసేజ్ పంపించారు. తాము క్షేమంగానే ఉన్నామని, తమను ఎవరూ బంధించలేదని ఆ వీడియోలో తెలిపారు. తమకు ఆహారం, మంచినీరు అందించడంతో పాటు… ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. తాము పనిచేస్తున్న కంపెనీలు… తమను బాగా చూసుకుంటున్నాయన్నారు. తమ విషయంలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని తెలిపారు. బీజింగ్ లో ఉన్న ఇండియన్ ఎంబసీతో మాట్లాడామని, త్వరలోనే స్వదేశానికి రానున్నట్లు  ఆ వీడియోలో చెప్పారు.