వార్డెన్, వర్కర్ వేధింపులు ఎక్కువైనయ్​..

వార్డెన్, వర్కర్ వేధింపులు ఎక్కువైనయ్​..
  •  ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్​మెయిల్ ​చేస్తున్నరు..
  •  కలెక్టరేట్ ను ముట్టడించిన ఎస్సీ హాస్టల్ స్టూడెంట్లు

గద్వాల, వెలుగు: ‘నీళ్ల చారు, గొడ్డు కారం, పురుగులు పడిన ఉడికీ ఉడకని అన్నం తినలేక పోతున్నాం.. హాస్టల్ వార్డెన్ వర్కర్ తమ ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు.. ’ అని వార్డెన్, వర్కర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ హాస్టల్ స్టూడెంట్లు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. రెండు గంటల పాటు బైఠాయించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు మాట్లాడుతూ.. ‘వండిన వంటలను కిందికి మేమే.. దింపుకోవాలి.. అన్నాన్ని, కూరలను మేమే వడ్డించుకోవాలి ఇదేమని ప్రశ్నిస్తే .. ఇది ఇంతే .. ఉంటే ఉండండి లేకుంటే లేదు. ఇది మీ అబ్బా జాగీరా.. ఫ్రీగా పెడుతున్నాం’ అని వేధిస్తున్నారని వాపోయారు.

 స్నానాలు చేసే టైంలో సీక్రెట్ గా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వాపోయారు. హాస్టల్​లో సౌలత్​లు సక్కగా లేవని, ఫ్యాన్లు లేకపోవడంతో హాస్టళ్లలో పడుకోలేక పోతున్నామన్నారు. తలుపులు కిటికీలు లేవని బాత్రూంలు క్లీన్ చేయడం లేదని  చెప్పారు. తమను వేధిస్తున్న వార్డెన్, వర్కర్ ను  వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్​లోని ఏవో కు వినతిపత్రం ఇచ్చారు.  విద్యార్థులకు ఎన్ఎస్​యూఐ స్టూడెంట్ యూనియన్ లీడర్లు మద్దతు తెలిపారు.