రేపిస్ట్ లను కాల్చడం తప్ప..ఇంకో పరిష్కారం ఉందా

రేపిస్ట్ లను కాల్చడం తప్ప..ఇంకో పరిష్కారం ఉందా

19ఏళ్ల దళిత యువతికి న్యాయం చేయాలని బాలీవుడ్ క్వీన్ కంగన రౌత్ డిమాండ్ చేసింది.  సెప్టెంబరు 14న ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హత్రాస్‌ ప్రాంతానికి చెందిన బాధితురాల్ని నలుగురు నిందితులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

రెండు వారాల తరువాత బాధితురాలు మరణించడంతో కంగన విచారణ వ్యక్తం చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రతి సంవత్సరం దేశంలో అత్యాచారాలు  పెరిగిపోతున్నారని అన్నారు.  ఇలాంటి వాళ్లను  కాల్చడం తప్ప వేరే పరిష్కారం అందుబాటులో ఉందా అని ప్రశ్నించారు.

ఈ రేపిస్టులను బహిరంగంగా కాల్చండి, ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఈ సామూహిక అత్యాచారాలకు పరిష్కారం ఏమిటని..? రనౌత్ ప్రశ్నించారు.

దేశం నిజంగా సిగ్గుపడే రోజు అమ్మాయిల్ని కాపాడడంలో విఫలం అవుతున్నాం అని రనౌత్ ఆవేదన వ్యక్తం చేసింది.

నటి రిచా చాధా కూడా హత్రాస్ సామూహిక అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించడానికి అర్హులే. నేరస్థులను శిక్షించాలని కోరారు.