వారానికి మూడు రోజులు ఆఫీస్ వర్క్.. టెక్ కంపెనీపై ఉద్యోగుల తిరుగుబాటు..

వారానికి మూడు రోజులు ఆఫీస్ వర్క్.. టెక్ కంపెనీపై ఉద్యోగుల తిరుగుబాటు..

కరోనా మహమ్మారి కాలం నుంచి అన్ని టెక్ కంపెనీలు  వర్క్ ఫ్రంహోంను ప్రోత్సహించాయి. అప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు అన్ని కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులు తిరిగి ఆఫీసుకు వచ్చి పనిచేయాలని ఆదేశాలు జారీ చేశాయి. కానీ టెక్ ఉద్యోగులు ఇందుకు సుముఖంగా లేరు. కంపెనీలు ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేసేందుకు ప్రోత్సహకాలు కూడా ప్రకటించాయి. ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేస్తే టీం వర్క్ ద్వారా కంపెనీ ప్రాడక్టివిటీ పెరుగుతుందన అంటున్నాయి. అయితే ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి ఉద్యోగం చేయకపోతే చర్యలు కూడా ఉంటాయని కొన్ని టెక్ కంపెనీలు పక్రటించాయి. దీంతో కంపెనీల తీరుపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఊకుమ్మడిగా తిరుగుబాటు కు సిద్ధమవు తున్నారు. 

యూరప్ కు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ SAP .. తమ రిమోట్ వర్క్ పాలసీని వెనక్కి తీసుకున్న తర్వాత 5 వేల మంది ఉద్యోగులనుంచి తిరుగుబాటును ఎదుర్కొంటుంది. ఈ జర్మన్  సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులు ఇప్పుడు తిరిగి వెళ్లకుండా వేరే ఉద్యోగాలు చూసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ టెక్ కంపెనీనికి చెందిన ఓ ఉద్యోగి ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. SAP ఉద్యోగుల నిబంధనలకు వ్యతిరేకంగా వారానికి మూడు రోజులు ఆఫీసుల్లో పనిచేయాలనడం సరైంది కాదని చెప్పారు. 

ప్రపంచ వ్యాపంగా ఉన్న ఉద్యోగులు ఏప్రిల్ నుంచి వారానికి మూడు రోజులు కార్యాలయంలో లేదు సైట్ లో పని చేయాల్సి ఉంటుందని జనవరి లో కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. వర్క్స్ కౌన్సిల్ ఆరోపణలను తోసిపుచ్చి ఇంటి నుంచి పనిచేయడం వల్ల కంపెనీ విధానాలు, టీంవ ర్క్ దెబ్బతింటుందని తెలిపింది. 

చాలా కంపెనీలు గతేడాది (2023) లో ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పనిచేయాలనికోరాయి. హ్యాపీ అవర్స్, కమ్యూటర్ రాయితీలు వంటి ప్రోత్సాహకాలను అందిస్తూ ఆఫీస్ వర్క్ ను పెంచేందుకు ప్రయత్నించాయి. దీంతో ఆఫీసుకు రాని ఉద్యోగులను చర్యలు కూడా చేపట్టాయి. 2024 జనవరి ప్రారంభంలో ఇంటర్నేషనల్ బిజినెస్ మెసీన్స్ కార్పొరేషన్ (IBM) కూడా మేనేజర్లకు ఆఫీసు కు వచ్చి పనిచేయాలని లేకుంటే కంపెనీ వదిలి వెళ్లాలని సూచించింది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.