ఇండియాను పవర్ ఫుల్ చేసినం

ఇండియాను పవర్ ఫుల్ చేసినం

ఏడాదిలోనే ఎన్నో సమస్యలకు పరిష్కారం 
 మోడీ సర్కారు ఏడాది పాలనపై బండి ​సంజయ్ ప్రశంసలు 

హైదరాబాద్, వెలుగుప్రపంచ దేశాల్లో ఇండియాను టాప్ ప్లేస్ లో నిలిపేందుకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ సర్కారు అనేక రిఫామ్స్ ను తెచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మోడీ నాయకత్వంలో దేశాన్ని పవర్ ఫుల్ కంట్రీగా నిర్మించే ప్రయత్నం జరుగుతోందని, ఈ ప్రయత్నంలో ప్రతి కార్యకర్తా అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఏండ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలను ఏడాది కాలంలోనే సాల్వ్ చేసిన ఘనత బీజేపీ సర్కారుకే దక్కిందన్నారు. మోడీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా, శనివారం హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాయంలో కార్యకర్తలను ఉద్దేశించి సంజయ్ మాట్లాడారు. ఆర్టికల్‌‌370, 35ఏను రద్దు చేయడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు.

అయోధ్య రామమందిరం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును శిరసావహించి దేశ ప్రజలందరిలో సమైక్యతను మోడీ పెంచారన్నారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేలా ట్రిపుల్ తలాక్ బిల్లును తెచ్చారన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లో మతపరమైన హింసకు గురైన మైనార్టీలకు సిటిజన్ షిప్ కల్పించేలా కేంద్రం సీఏఏను తీసుకురావడం గొప్ప నిర్ణయమని ప్రశంసించారు.  ఏడాది కాలంలోనే 36 బిల్లులను బీజేపీ సర్కారు పాస్ చేయించిందని సంజయ్ చెప్పారు. అనేక సమస్యలను పరిష్కరించిన17వ లోక్ సభలో తానూ ఒక సభ్యుడు అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి మోడీ సకాలంలోనే లాక్ డౌన్ ప్రకటించారని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా భారీ ప్యాకేజీతో న్యాయం చేశారని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..