బోడోల డిమాండ్లన్నీ తీర్చేశాం

బోడోల డిమాండ్లన్నీ తీర్చేశాం

ఏళ్లనాటి సమస్య పరిష్కారమైంది
పోయిన ప్రభుత్వాలు ధైర్యం చేయలే..
అస్సాంలోని కోక్రాఝర్​లో ప్రధాని మోడీ

కోక్రాఝర్(అస్సాం): ‘బోడో ఒప్పందం చరిత్రాత్మకం.. ఈ ఒప్పందంతో రీజియన్​లో శాంతి నెలకొంటుంది.  సంవత్సరాలుగా కొనసాగుతున్న తిరుగుబాటువల్ల ఇక్కడ వేలాది మంది చనిపోయారు. అయినా గత ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలే. ఈ సమస్యను టచ్ చేయడానికి కూడా భయపడ్డాయి. నార్త్​ ఈస్ట్​ రీజియన్​లో శాంతి నెలకొల్పాలన్న సంకల్పంతో మా ప్రభుత్వం ముందుకొచ్చింది. తాజా ఒప్పందంతో ఇక్కడ శాంతి నెలకొంటుంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పార్లమెంట్​లో సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్(సీఏఏ) పాస్​ అయ్యాక తొలిసారిగా అస్సాంలో పర్యటిస్తున్న మోడీ.. శుక్రవారం కోక్రాఝర్​లో జరిగిన సభలో పాల్గొన్నారు. బోడో ఒప్పందం చరిత్రాత్మకమన్న మోడీ.. ఇందుకు ఆల్​బోడో స్టూడెంట్స్ యూనియన్(ఏబీఎస్​యూ), నేషనల్​ డెమోక్రాటిక్​ ఫ్రంట్​ఆఫ్​ బోడోలాండ్(ఎన్​డీఎఫ్​బీ), బీటీసీ సంస్థలకు చెందిన యువత, అస్సాం ప్రభుత్వం కృషి చేశారని కొనియాడారు. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న సమస్యను పరిష్కరించడంతో పాటు శాంతి, అభివృద్ధికి ఈ ఒప్పందంతో కొత్త శకం మొదలవుతుందని ప్రధాని చెప్పారు. గతంలో 1993, 2003లో కూడా ఇలాంటి ఒప్పందాలు కుదిరినా టెంపరరీ పరిష్కారాలే తప్ప బోడోల సమస్యకు పర్మినెంట్ పరిష్కారం చూపలేకపోయాయి. తాజా ఒప్పందం తర్వాత ఇక మరే డిమాండ్​అసంపూర్తిగా మిగలలేదని మోడీ చెప్పారు. నార్త్​ఈస్ట్​ రాష్ట్రాలపై గతంలో ఉన్న అభిప్రాయాన్ని మా సర్కారు మార్చేసింది. అభివృద్ధి, శాంతి కోసం మనందరం కలిసి పనిచేయాలి. మరోసారి హింసకు చోటివ్వద్దని అన్నారు.

చరిత్రాత్మక ఒప్పందం

అస్సాంలోని బోడో తిరుగుబాటుదారుల ప్రభావం ఉన్న ఏరియాల్లో శాంతి నెలకొల్పేందుకు ప్రభుత్వం నాలుగు ఆర్గనైజేషన్లతో జనవరి 27 న బోడో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం కుదిరిన రెండు రోజులకు ఎన్​డీఎఫ్​బీ సహా ఇతర సంస్థలకు చెందిన మొత్తం 1615 మంది ఆయుధాలతో ప్రభుత్వానికి లొంగిపోయారు.

తాజా ఒప్పందం హైలైట్స్

ఆయుధాలు విడిచిపెట్టే ఎన్​డీఎఫ్​బీ  యాక్టివిస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిహేబిలిటేషన్​ కల్పిస్తాయి.
వచ్చే మూడేళ్లలో రూ. 1500 కోట్లతో అభివృద్ధి పనులు.
బోడోల్యాండ్​ను ఇకమీదట బోడోల్యాండ్​ టెరిటోరియల్​ కౌన్సిల్​ (బీటీసీ) అని పిలుస్తారు.
రైల్​ కోచ్​ ఫ్యాక్టరీ, నేషనల్​ స్పోర్ట్స్​ యూనివర్సిటీ, బరామాలో సెంట్రల్​ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తారు.