
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకుడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్.కె.ఎన్ నిర్మించిన చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు విరాజ్. నా రియల్ నేమ్ క్యారెక్టర్ చేయడం సంతోషంగా ఉంది. ఇందులో పాత్రలన్నీ చాలా సహజంగా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌కు ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. రియల్ వరల్డ్‌తో కనెక్ట్ అయినట్లు బిహేవ్ చేస్తుంటాయి. నేను కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తా. జీవితం గురించి ఏమీ తెలియని ఓ కుర్రాడు.
యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటాడు. ఇందులో ప్రేమను పెయిన్ ద్వారా చూపించాం. అందుకే ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ అని చెబుతున్నాం. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ అయినా రెగ్యులర్‌గా, రొటీన్‌గా ఉండదు. దర్శకుడు సాయి రాజేష్ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేశాడు. డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ అయితే.. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తాయి. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో టీమ్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ చిత్రానికి ఎస్‌కెఎన్ పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ అనిపిస్తుంటుంది.