విశ్వాసం లేకే అవిశ్వాసం పెట్టినం....డీసీసీబీ ఇన్​చార్జి ​చైర్మన్ ​కుంట రమేశ్​రెడ్డి

విశ్వాసం లేకే అవిశ్వాసం పెట్టినం....డీసీసీబీ ఇన్​చార్జి ​చైర్మన్ ​కుంట రమేశ్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు: డీసీసీబీ చైర్మన్​గా పోచారం భాస్కర్​రెడ్డిపై విశ్వాసం లేకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి సక్సెస్​ అయ్యామని ఇన్​చార్జ్​ చైర్మన్​గా నియమితులైన కుంట రమేశ్​రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. భాస్కర్​రెడ్డిపై చాలాకాలంగా పాలకవర్గంలో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. నో కాన్ఫిడెన్స్​కు ఓటేసిన డైరెక్టర్లలో అన్ని పార్టీలవారున్నారన్నారు. బ్యాంకులో జరిగిన అవినీతి, ఇతర అంశాలను మున్ముందు పరిశీలిస్తామన్నారు.

ఉర్దూ అకాడమీ చైర్మన్​ తాహెర్, లైబ్రరీ కమిటీ మాజీ చైర్మన్​ శ్రీనివాస్, అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఇన్​చార్జి చైర్మన్​గా నియమితులైన కుంట రమేశ్​రెడ్డి వేల్పూర్​సింగిల్​ విండోకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బోధన్​ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డికి సొంత చిన్నమ్మ కొడుకు. భాస్కర్​రెడ్డిపై అవిశ్వాస రాజకీయాలకు నాయకత్వం వహించారు.