శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తాం : అమిత్ షా

శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తాం : అమిత్ షా

దేశ వ్యాప్తంగా త్వరలోనే జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్నార్సీ)ను చేపడతామన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. చొరబాటు దారులను ఎట్టి పరిస్థతుల్లో దేశంలో ఉండనివ్వమని స్పష్టం చేశారు. శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు షా. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంత వ్యతిరేకించినా.. బీజేపీ కచ్చితంగా ఎన్నార్సీని అమలు చేసి తీరుతుందన్నారు.

మంగళవారం కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజలో పాల్గొన్న అమిత్‌ షా.. ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ఎన్నార్సీపై జరిగిన సెమినార్‌లో పాల్గొన్నఆయన… పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ ఓటు బ్యాంక్‌ను పెంచుకోవడానికే చొరబాటుదారులకు మమత మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు.