భారత్ కంటే పాక్ బౌలింగ్ బెటర్...

భారత్ కంటే పాక్ బౌలింగ్ బెటర్...

ఆసియా కప్ 2022లో భారత్ పాక్ మరోసారి ఢీకొట్టుకోబోతున్నాయి. సూపర్ 4లో భాగంగా టీమిండియా చిరకాల ప్రత్యర్థి -పాకిస్తాన్ తో ఆడబోతుంది. ఈ సందర్బంగా పాక్ తో మ్యాచ్లో ఆవేష్ ఖాన్ ఆడడం లేదని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వెల్లడించారు. అవేష్ ఖాన్‌ జ్వరం బారిన పడ్డాడని.., అందుకే నెట్ ప్రాక్టీస్‌కు కూడా దూరంగా ఉన్నాడని తెలిపాడు. పాక్ బౌలింగ్ బాగుందని ద్రావిడ్ కితాబిచ్చాడు. వారి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారని చెప్పాడు. 

మన బౌలర్లు తక్కువేం కాదు..
టీమిండియా బౌలింగ్ కూడా బాగుందని రాహుల్ ద్రావిడ్ అన్నారు. ఫస్ట్ మ్యాచ్ లో పాక్ ను 147 పరుగులకే కట్టడి చేసిన విషయాన్ని గుర్తుచేశాడు. 145 నుంచి 147 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి బౌలర్లు భారత్ సొంతమని చెప్పాడు. అయితే ఎవరి వనరులు వారికుంటాయని..ఫైనల్ గా మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేదే ముఖ్యమన్నాడు. అయితే పాక్ బౌలింగ్ టీమిండియా బౌలింగ్‌ కంటే బలంగానే ఉన్నప్పటికీ.. కొన్ని టెక్నిక్స్ పాక్‌లో లోపించాయని చెప్పాడు.

జడేజా స్థానంలో అక్షర్..
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది.  ఆసియా కప్ సూపర్ 4 దశలో ఇది సెకండ్ మ్యాచ్. ఈ కీలకమైన ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరం అయ్యాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ జట్టులో చేరాడు. తాజాగా జ్వరం వల్ల పేస్ బౌలర్ అవేష్ ఖాన్ కూడా ఆడే పరిస్థితి లేదు. అయితే స్పిన్నర్ రవి బిష్ణోయ్ కు..తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది.