వాగులో పడి చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం .. ఎమ్మెల్యే కోవ లక్ష్మి

 వాగులో పడి చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం .. ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్, వెలుగు: వాంకిడి మండలం దాబా గ్రామానికి చెందిన నిర్మలబాయి, గణేశ్, శశికళ, మహేశ్వరి శనివారం వాగులో పడి చనిపోగా ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం దాబా గ్రామాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి సందర్శించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దహన సంస్కారాలకు వందలాది మంది తరలివచ్చారు.