ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్​నగర్​, వెలుగు : ప్రభుత్వం మైనార్టీలకు అన్ని విధాల అండగా ఉంటోందని ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్ ​గౌడ్​ చెప్పారు. మిలాద్​ ఉన్​ నబీ సందర్భంగా మహబూబ్​నగర్ జిల్లా కేంద్రం లోని ఆల్మాస్​ ఫంక్షన్​ హాల్, మోతినగర్​లోని మసీదులో ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సాయంత్రం  నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.  అంతకుముందు స్థానిక క్రిస్టియన్ కాలనీలో ఉన్న ఆర్యవైశ్య హాస్టల్‌‌లో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను  అందించారు. అలాగే జడ్చర్ల, -మహబూబ్ నగర్ మార్గంలో మల్లెబోయినపల్లి తండా వద్ద దళితబంధు స్కీం కింద ఏర్పాటు చేసిన బ్రిక్స్, ఆర్గానిక్ పేపర్ ప్లేట్ల యూనిట్‌‌ను ఓపెన్‌‌ చేశారు.  తర్వాత బోయపల్లి గేట్ సమీపంలో ఉన్న వాల్మీకి రామాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వాల్మీకి సంఘం, పాలమూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో యువకవి కోలంట్ల రామకృష్ణ రచించిన ‘వాల్మీకి మొగ్గలు’ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.  వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దీనిచఐ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ ​రెడ్డి ఆధ్వర్యంలో న్యాయపరమైన చిక్కులను అధిగమించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. మున్సిపల్ చైర్మన్​ కోరమోని నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు రామ్మోహన్, నాయకులు చెరుకుపల్లి రాజేశ్వర్ పాల్గొన్నారు.

పేట కలెక్టర్‌‌‌‌గా శ్రీహర్ష బాధ్యతలు

నారాయణపేట, వెలుగు: నారాయణపేట కొత్త కలెక్టర్‌‌గా నియమితులైన కోయ శ్రీహర్ష ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.  గద్వాల అడిషనల్‌‌ కలెక్టర్‌‌గా పనిచేస్తూ ప్రమోషన్‌‌పై పేటకు వచ్చిన ఆయనకు కలెక్టరేట్‌‌లో అడిషనల్‌‌ కలెక్టర్లు కే.చంద్ర రెడ్డి, పద్మజారాణి, ఆర్డీవో రామచంద్రనాయక్ బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం చాంబర్‌‌లోకి తీసుకెళ్లగా సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు.   

కోయిల్​సాగర్​ ఓవర్ ప్లో

దేవరకద్ర​, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్​సాగర్​ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. కోస్గి, కొడంగల్, కోయిల్​కొండ ప్రాంతాల్లో వారం రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో అంకిళ్ల వాగు ఉధృతంగా పారుతోంది. ఈ వాగు నీరు కోయిల్​సాగర్​లో వచ్చి చేరుతుండటంతో ఆదివారం ఉదయం ప్రాజెక్టు గేట్ల మీద నుంచి నీళ్లు పారాయి. ప్రాజెక్టు కెపాసిటీ 2.276 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.2‌‌‌‌టీఎంసీ నీరు నిల్వ ఉన్నది. సాయంత్రం నుంచి వరద కొంత తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇరిగేషన్​ ఆఫీసర్లు మూడు గేట్లను ఓపెన్​ చేసి దిగువకు నీటిని విడుదల 
చేస్తున్నారు.  

కోయిల్​సాగర్​ ఓవర్ ప్లో

దేవరకద్ర​, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్​సాగర్​ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. కోస్గి, కొడంగల్, కోయిల్​కొండ ప్రాంతాల్లో వారం రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో అంకిళ్ల వాగు ఉధృతంగా పారుతోంది. ఈ వాగు నీరు కోయిల్​సాగర్​లో వచ్చి చేరుతుండటంతో ఆదివారం ఉదయం ప్రాజెక్టు గేట్ల మీద నుంచి నీళ్లు పారాయి. ప్రాజెక్టు కెపాసిటీ 2.276 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.2‌‌‌‌టీఎంసీ నీరు నిల్వ ఉన్నది. సాయంత్రం నుంచి వరద కొంత తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇరిగేషన్​ ఆఫీసర్లు మూడు గేట్లను ఓపెన్​ చేసి దిగువకు నీటిని విడుదల 
చేస్తున్నారు.  

యాదవులు అన్ని రంగాల్లో రాణించాలి

గద్వాల టౌన్, వెలుగు:  యాదవులు అన్ని రంగాలలో రాణించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బండల వెంకట్ రాములు ఆకాక్షించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన వెంకటేశ్‌‌ యాదవ్,  వెంకటయ్య యాదవ్‌‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులంతా ఏకంగా ఉండి హక్కులను సాధించుకోవాలని సూచించారు.  ఉత్తమ టీచర్లుగా ఎంపికై  యాదవులకు మంచి పేరు తీసుకొచ్చారని అభినందించారు.  బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి,  నేతలు నాగులు గీతా యాదవ్, నాగేందర్,  తుమ్మల నరసింహులు, భాస్కర్ యాదవ్, బండల సాయిబాబా పాల్గొన్నారు.

ఘనంగా మిలాద్ ఉన్ నబీ

మిలాద్ ఉన్ నబీ(మహమ్మద్ ప్రవక్త జన్మదినం) వేడుకలను ఉమ్మడి జిల్లాలోని ముస్లింలు  ఘనంగా నిర్వహించారు.  ఆదివారం మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు ప్రధాన వీధుల్లో జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. నారాయణపేటలో ఎమ్మెల్యే రాజేందర్‌‌‌‌ రెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్లు ముస్లింలకు జ్యూస్‌‌ అందించి ఈద్‌‌ ముబారక్‌‌ చెప్పారు. నాగర్‌‌‌‌ కర్నూల్‌‌లో జామే నిజామియా అరబ్బీ వర్సిటీ ఆలిం మౌలానా హ హమ్మద్ అజీముద్దీన్ నక్ష్ బందీ మాట్లాడుతూ  సన్మార్గంలో నడిచినప్పుడే స్వర్గప్రాప్తి లభిస్తుందని, నమాజ్, రోజా వంటివి కచ్చితంగా పాటించాలని సూచించారు.   

 - నెట్‌‌వర్క్, వెలుగు 

యాదవులు అన్ని రంగాల్లో రాణించాలి

గద్వాల టౌన్, వెలుగు:  యాదవులు అన్ని రంగాలలో రాణించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బండల వెంకట్ రాములు ఆకాక్షించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన వెంకటేశ్‌‌ యాదవ్,  వెంకటయ్య యాదవ్‌‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులంతా ఏకంగా ఉండి హక్కులను సాధించుకోవాలని సూచించారు.  ఉత్తమ టీచర్లుగా ఎంపికై  యాదవులకు మంచి పేరు తీసుకొచ్చారని అభినందించారు.  బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి,  నేతలు నాగులు గీతా యాదవ్, నాగేందర్,  తుమ్మల నరసింహులు, భాస్కర్ యాదవ్, బండల సాయిబాబా  పాల్గొన్నారు.

మహిళలు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి'

నారాయణపేట, వెలుగు: మహిళల ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని సీసీఎంబీ సైంటిస్టు  చందన చక్రవర్తి సూచించారు.  ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర 7వ మహాసభల్లో 2వ రోజైన ఆదివారం పేట మెట్రోగార్డెన్‌‌లో  పీవోడబ్ల్యూ రాష్ట్ర​అధ్యక్షురాలు కె.రమ జెండా ఆవిష్కరించి సభను ప్రారంభించారు. అనంతరం సెంటర్‌‌‌‌ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సైంటిస్టు చందన చక్రవర్తి మాట్లాడుతూ మహిళలు తరతరాలుగా అన్నిచోట్ల అణిచివేయబడ్డారని వాపోయారు. స్వాతంత్ర్యం అనంతరం వచ్చిన చట్టాలు మహిళల ఎదుగుదలకు తోడ్పడ్డాయని, పైలెట్లు, ఇంజనీర్లు, డాక్టర్లుగా రాణిస్తున్నారని చెప్పారు.  కానీ,  పితృస్వామ్య సమాజానికి ప్రతీకగా ఆర్‌‌‌‌ఎస్‌‌ఎస్‌‌ భావాలు అధికారంలోకి వచ్చాయని,  మను సంస్కృతిని తిరిగి ప్రతిష్టించే పనిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  మహిళలను రుతుస్రావం రోజుల్లో అపవిత్రంగా చూడటం బాధాకరమని,  రుతుస్రావం లేకపోతే పునరుత్పత్తి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తల్లిదండ్రులు ఆడ, మగ వివక్ష లేకుండా పిల్లలను పెంచినప్పుడే సమానత్వం సాధ్యమవుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోదావరి, సహాయ కార్యదర్శులు కల్పన, విజయలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు శిరోమణి, ఝాన్సీ, లలిత, సంధ్య, స్వరూప, లక్ష్మీబాయి, విజయలక్ష్మి, సావిత్రి, జిల్లా అధ్యక్షురాలు శారద, ఉపాధ్యక్షురాలు లక్ష్మి,   కార్యదర్శి సౌజన్య, సహాయ కార్యదర్శి భాగ్యలక్ష్మి, కోశాధికారి మాధవి పాల్గొన్నారు.

అనుమానాస్పదంగా ఒకరి మృతి 

కొడుకుతో కలిసి భార్యే చంపిందని అనుమానాలు 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. కొడుకుతో కలిసి భార్యే చంపిందని బంధువులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ మండలం మల్కాపూర్‌‌‌‌కు చెందిన మెంట పర్వతాలు (42) తెల్కపల్లి మండలం తాళ్లపల్లికి చెందిన లింగమ్మ(40)ను ఇల్లరికం వివాహం చేసుకొని అక్కడే ఉంటున్నాడు. ఇతని పేరుపై ఉన్న భూమిని అమ్మాలని భార్య,  కొడుకు శివ(18) కొన్నాళ్లుగా ఒత్తిడి చేస్తున్నారు. శనివారం రాత్రి పర్వతాలు ఉరి వేసుకున్నాడని తల్లీకొడుకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించంతో డెడ్‌‌బాడీని తిరిగి గ్రామానికి తీసుకెళ్లారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా శరీరంపై గాయాలు, బట్టలకు రక్తం ఉండడం గమనించిన బంధువులు తల్లీకొడుకులను ప్రశ్నించారు. తమకేమీ తెలియదని చెప్పడంతో  డెడ్‌‌బాడీని జీపీ వద్దకు తీసుకెళ్లి పోలీసులను పిలిపించారు.  అక్కడికి చేరుకున్న ఎస్సై ప్రదీప్  బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పదంగా మృతిగా కేసు నమోదు చేసి, డెడ్‌‌బాడీని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.  రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పారు.  

పోడు భూములకు పట్టాలివ్వాలి

అమ్రాబాద్, వెలుగు: చెంచులు ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఈ లింగయ్య డిమాండ్ చేశారు.  ఆదివారం మన్ననూర్‌‌‌‌లోని  గిరిజన భవన్ వద్ద రాష్ట్ర ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  చెంచు పెంటలు, గూడేల్లో కరెంటు, తాగునీరు, రోడ్డు సౌకర్యం లేదని వాపోయారు ఈజీఎస్‌‌ను ఇతర పనులకు అనుసంధానం చేయడంతో కోర్‌‌‌‌ ఏరియాలో పనులు దొరకడం లేదన్నారు ఐటీడీఏకు రెగ్యులర్ పీవో, సిబ్బంది నియమించాలని అర్హులైన చెంచులకు రేషన్ కార్డులు,  పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు.  ఆదివాసీ టీచర్స్‌‌ ఫెడరేషన్ నేతలు ప్రేమ్,  పెద్దిరాజు,  రాయ శ్రీనివాసులు,   గురవయ్య,   లింగయ్య,  విజయభాస్కర్,   లింగస్వామి,  మంగ్లీ,  బాలరాజు,   ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీ సంఘం నేతలు  శ్రీనివాసులు,  మల్లికార్జున్,  రాజేంద్రప్రసాద్,  అంజయ్య,   వివిధ  జిల్లాలకు చెందిన 300 మంది ప్రతినిధులు ఉన్నారు.

వాల్మీకులను మోసం చేస్తున్న సర్కారు

గద్వాల, వెలుగు: ఇచ్చిన హామీ అమలు చేయకుండా ప్రభుత్వం వాల్మీకి బోయలను మోసం చేస్తోందని ఆ సంఘం జేఏసీ నాయకుడు మధుసూదన్ బాబు మండిపడ్డారు.  ఆదివారం గద్వాల వాల్మీకి భవన్‌‌లో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసే నివాళి అర్పించారు. అనంతరం గాంధీ చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి..  గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు.  ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల రింద గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభలో  వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో కలుపుతామని సీఎం కేసీఆర్ మాటిచ్చారని గుర్తుచేశారు.   చల్లప్ప కమిటీ రిపోర్టు ఇచ్చినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్  ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని, తమ డిమాండ్ కూడా నెరవేర్చాలన్నారు.  ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోకవడంతో అధికారికంగా నిర్వహించే వేడుకలను బహిష్కరించి నిరసన ర్యాలీని నిర్వహించామన్నారు.  ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం లీడర్లు రామాంజనేయులు, రాములు, నగేశ్, బలిగేర నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈబీసీలకు గురుకులాలు ఏర్పాటు చేయాలి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: అగ్రవర్ణ పేదలకు కేంద్రం ఇచ్చిన 10శాతం రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్న 962 గురుకులాల్లో 92 గురుకులాలను కేటాయించాలని రెడ్డి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు తూము ఇంద్రసేనా రెడ్డి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సేవా సమితి రాజాబహద్దూర్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్‌‌‌‌లో నిర్వహించిన పాలమూరు రెడ్డి సేవా సమితి కార్యవర్గ సమావేశానికి ఆయన చీఫ్‌‌ గెస్టుగా హాజరయ్యారు.   పోలీస్ పోటీ పరీక్షలతో పాటు గ్రూప్స్‌‌లోనూ 10శాతం రిజర్వేషన్లకు అనుగుణంగా అర్హత మార్కులు తగ్గించాలన్నారు.  పాలమూరు రెడ్డి సేవా సమితి గ్రామ, నియోజకవర్గ, జిల్లా స్థాయి ఎన్నికలను అక్టోబర్ నెలాఖరులోగా పూర్తి చేసి.. నవంబర్ ఉమ్మడి జిల్లా ఎన్నికను నిర్వహించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో  సంఘం గౌరవ అధ్యక్షుడు వేపూరి చిన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి పోతుల రాఘవరెడ్డి, కోశాధికారి వేపూరి రాజేందర్ రెడ్డి, కార్యదర్శి జి.వెంకట్రామరెడ్డి, ప్రచార కార్యదర్శి నల్లమద్ది సురేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పసుల ధనుంజయరెడ్డి పాల్గొన్నారు.

వాల్మీకి జీవితం నేటి తరానికి ఆదర్శం

మహర్షి వాల్మీకి జీవితం నేటి తరానికి ఆదర్శమని కలెక్టర్లు కొనియాడారు. ఆదివారం వాల్మీకి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లలో బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధ్వర్యంలో ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు.  ఈ సందర్భంగా వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, పేట, గద్వాల కలెక్టర్లు వెంకట్‌‌‌‌రావు, శ్రీహర్ష, వల్లూరి క్రాంతి మాట్లాడుతూ వాల్మీకి రాసిన రామాయణంలో ధర్మం, సత్యం, సోదరభావం, ప్రజాపాలన కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయన్నారు.  రామాయణం కేవలం ఒక కావ్యం కాదని, మానవ జీవితానికి దిక్సూచి లాంటిందన్నారు. నారాయణపేటలోని వాల్మీకి గుడిలో వాల్మీకి సంఘం నేతలు ప్రత్యేక పూజలు చేశారు. 

- నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు