
కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణం తనకు పెద్ద షాక్ అన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్. ఆమెతో తనకు 1970 నుంచి పరిచయం ఏర్పడిందన్నారు. తాను ఆమెను సోదరిగా పిలిచేవాడినని, ఆమె కూడా ఎంతో ఆప్యాయంగా తనను సోదరుడిగా పలుకరించేవారని చెప్పారు. సుష్మా ఆత్మకు శాంతి చేకూర్చాలని అల్లాను, భగవంతుడిని కోరుతున్నానని గులాం నబీ ఆజాద్ అన్నారు.