పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి

పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి
  • ఇప్పటి వరకు 41లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం
  • మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్:  అధిక భారమైనా.. ఆర్ధిక భారం  అయినప్పటికీ.. చివరి గింజ వరకు కొంటున్నామని.. మరో పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇప్పటికే రెండు వేల కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ పూర్తి చేశామన్నారు. మొత్తం 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు రైసు మిల్లులు సరిపోవడంలేదన్న మంత్రి... మార్కెట్ యార్డులు, గోదాముల్లో స్థలాలు పరిశీలిస్తున్నామన్నారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు మంత్రి. 
ప్రతిపక్షాలు కొట్లాట పెట్టినా చివరి గింజ వరకు కొంటున్నామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఏ ఊరి ధాన్యాన్ని అదే ఊరిలో కొనుగోలు చేస్తున్నామని.. 5వేల ఎకరాల కంటే ఎక్కువ సాగయితే ఒకే ఊరిలో 2, 3 కేంద్రాలు పెట్టామన్నారు. మొత్తం 6,892 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొంటున్నామని.. మరో 10 రోజుల్లో పూర్తి అవుతాయని మంత్రి వివరించారు. 

 

ఇవి కూడా చదవండి

తెలంగాణలో అధికారం మారుతుంది 

న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావాలి

ప్రజల వెసులుబాటు కోసమే కొత్త కోర్టులు