దోషులకు ఉరిశిక్ష పడేలా చూస్తాం:మణిపూర్ సీఎం బీరేన్ సింగ్

దోషులకు ఉరిశిక్ష పడేలా చూస్తాం:మణిపూర్ సీఎం బీరేన్ సింగ్

ఇంఫాల్: మహిళలను నగ్నంగా తిప్పిన ఘటన మానవత్వానికి మచ్చ అని, దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ అన్నారు. ఈ ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన ప్రకటించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వారికి మరణ శిక్ష పడేలా చూస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు జరుగుతోందన్నారు. సమాజంలో ఇలాంటి చర్యలకు అస్సలు చోటు లేదన్నారు. నిందితుల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు.