సర్పంచ్ ల ఖాతాల్లో రూ. 4,800 కోట్లు వేస్తాం :హరీష్ రావు

సర్పంచ్ ల ఖాతాల్లో రూ. 4,800 కోట్లు  వేస్తాం :హరీష్ రావు

ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ లో రూ. 6,300 కోట్లు రుణమాఫీ కోసం కేటాయించామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్ అండ్ బీ శాఖకు రూ. 2,500 కోట్లు కేటాయిస్తే.. ఈ సారి కేవలం రోడ్ల మరమ్మతుల కోసమే రూ. 2,500 కోట్లు కేటాయించామని చెప్పారు. యూనివర్సిటీ హాస్టల్ కోసం రూ.500 కోట్లు అలాట్ చేసినట్లు హరీష్ ప్రకటించారు. సర్పంచ్ లకు నిధులు రాలేదనే సమస్య ఇకపై ఉండదని... ఇప్పట్నుంచి డైరెక్ట్ గానే నిధులు వేస్తామని హామీ ఇచ్చారు. రూ.4,800 కోట్లు సర్పంచ్ ల ఖాతాల్లో వేస్తామని తెలిపారు. ఉద్యోగ నియామకాల కోసం రూ.1000 కోట్లు అదనంగా కేటాయించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులు, సెర్ఫ్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారని .. మైనార్టీ శాఖకు కూడా నిధులు పెంచామని స్పష్టం చేశారు.