డిస్ట్రిబ్యూటర్ సతీష్కు న్యాయం జరగడం కోసం ఎంత దూరమైనా వెళతాం: ప్రొడ్యూసర్ నట్టి కుమార్

డిస్ట్రిబ్యూటర్ సతీష్కు న్యాయం జరగడం కోసం ఎంత దూరమైనా వెళతాం: ప్రొడ్యూసర్ నట్టి కుమార్

అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాను గాయత్రి ఫిలిం యాజమాని డిస్ట్రిబ్యూటర్..బత్తుల సత్యనారాయణ (సతీష్)(Battula Satyanarayana). భారీ ధరకి కొనుగోలు చేశారు. కానీ విడుదల తర్వాత చాలా నష్టం ఏర్పడింది. ఏజెంట్ మూవీకి రావలసిన డబ్బులను ఇంత వరకి చెల్లించలేదు. 

దీంతో ఇదే విషయంపై నిర్మాత నట్టి కుమార్(Natti Kumar) స్పందిస్తూ..సినిమా వ్యాపారం ఎన్నో ఏళ్లుగా నమ్మకం మీద సాగుతూ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు బావుంటేనే సినీ పరిశ్రమ బావుంటుంది. అయితే  వారిని మోసం చేయడం తరుచుగా మన ఇండస్ట్రీలో కనిపిస్తోంది. అంతే కాకుండా..నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ వంటివి మోసపోయిన వారి పక్షాన నిలబడి న్యాయం చేయాలి. కానీ, మోసం చేసిన వారికి సపోర్ట్ గా నిలుస్తుండటం చాలా భాధను కలిగిస్తోంది.అలాగే నాకు మంచి మిత్రుడైన వైజాగ్ సతీష్ ఏజెంట్ మూవీ విషయంలో రూ.30 కోట్లు నష్టపోగా.. తిరిగి ఇస్తానన్న అమౌంట్ ఇంత వరకి ప్రొడ్యూసర్స్ ఇవ్వలేదు. ఇప్పుడు సతీష్ వీరి చుట్టూ..ఎంత తిరిగిన ఫలితం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో న్యాయస్థానంకు వెళ్లారు.

ఏజెంట్ ప్రొడ్యూసర్స్ చేతిలో మోసపోయిన సతీష్కు న్యాయం జరగడం కోసం నేను తనవైపు సపోర్ట్గా నిలిచాను. సదరు నిర్మాతలు ఐటీ, జీఎస్టీ వంటివి కట్టకుండా, చాలాకాలంగా గవర్నమెంట్ను మోసం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. వాటి అన్నింటిపైనా ఫిర్యాదులు చేయబోతున్నాం. సతీష్ కు పూర్తి న్యాయం జరిగేంత వరకు ఎంతదూరమైనా వెళతాం. ఇప్పటికే నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసులు రిజిస్టర్ అయ్యాయి. అలాగే సివిల్ కోర్టులో మెయిన్ కేసు కొనసాగుతోందని..నట్టి కుమార్ వెల్లడించారు.