భారత్ సాయాన్ని మరువబోం

భారత్ సాయాన్ని మరువబోం

కరోనా కష్ట కాలంలో భారత్ అందించిన తోడ్పాటును మరువబోమని మాల్దీవ్స్ అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలీహ్ స్పష్టం చేశారు. భారత్, మాల్దీవ్స్ దేశాల మధ్యనున్న మైత్రి గురించి ఆయన మాట్లాడారు. గత రెండేళ్లలో భారత్ మాల్దీవ్స్ కు చాలా సాయం చేసింది. కరోనాను జయించేందుకు వ్యాక్సిన్ ను దానం చేసింది. 250 మిలియన్ డాలర్ల విలువైన ఫైనాన్షియల్ బ్రాండ్లను భారత్ కొనుగోలు చేసింది. ఆరోగ్య సేవలను అందించడానికి అవసరమైన అనేక పరికరాలను భారత్ నుంచి పొందామని తెలిపారు. రెండు దేశాల మధ్య పర్యాటక బంధాన్ని బలోపేతం చేసేందుకు ట్రావెల్ కారిడార్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇండియాకు వెళ్లేందుకు మాల్దీవ్స్ టూరిస్టులకు భారత ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తోందన్నారు.