భూభారతి ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం : కలెక్టర్  ఆదర్శ్  సురభి

 భూభారతి ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం : కలెక్టర్  ఆదర్శ్  సురభి

గోపాల్ పేట, వెలుగు: రైతులు భూ సమస్యలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భూభారతి ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని వనపర్తి కలెక్టర్  ఆదర్శ్  సురభి భరోసా ఇచ్చారు. శుక్రవారం మండలంలోని ఏదుట్ల గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్  సందర్శించారు. తగిన ఆధారాలు తీసుకువస్తే అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన సదస్సుల్లో 322 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్  పాండు నాయక్  పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులపై దృష్టి పెట్టాలి

వనపర్తి: జిల్లాలోని అన్ని మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు తహసీల్దార్లు సిద్ధంగా ఉండాలని కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు. కలెక్టరేట్​లో తహసీల్దార్లతో  రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యే నాటికి ధరణి లాగిన్ లో అప్లికేషన్లు పెండింగ్ లో లేకుండా చూసుకోవాలన్నారు.

అనంతరం నిర్వహించిన జిల్లా స్థాయి లే ఔట్​ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతి లేకుండా చేపట్టిన ఇండ్ల నిర్మాణాలు చేసిన వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని సౌలతులు ఉంటేనే కమిటీ ఆమోదం తెలుపుతుందని చెప్పారు. అడిషనల్  కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య 
పాల్గొన్నారు.